ADA Srinath: కొనుగోలు కేంద్రాల‌ను సంద‌ర్శించిన డివిజనల్ ఏడీఏ శ్రీనాథ్

సిరాన్యూస్, ఓదెల‌
కొనుగోలు కేంద్రాల‌ను సంద‌ర్శించిన డివిజనల్ ఏడీఏ శ్రీనాథ్

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓదెల లంబాడి తండా, కోలనూరు, హరిపురం గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి జిల్లా వ్యవసాయ డివిజనల్ ఏడీఏ శ్రీనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి లు కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోళ్లు చేయాలన్నారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు కొనుగోళ్లు కేంద్రాల్లో అందుబాటు లో ఉంటూ రైతులకు రశీదులు ఇవ్వాలన్నారు. రైతులు ప్రైవేటు దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాల్లో ధాన్యం తీసుకురావాలని కోరారు. తూకం వేసిన 48 గం. లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వ మద్దతు ధర రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్, ఏఈఓలు సెంటర్ ఇన్చార్జి లు, రైతులు, తదితరులు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *