నవంబర్ 18 (సిరా న్యూస్)
జగిత్యాల
డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన కవిత విశ్రాంతి తీసుకునే క్రమంలో అక్కడ చిన్నారితో ముచ్చటించారు. దీనిపై కల్వకుంట్ల కవిత “ఎక్స్” లో స్పందిస్తూ … “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. చిన్నారితో కాసేపు ముచ్చటించిన తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను” అని పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురై కాసేపు విశ్రాంతి తీసుకున్న కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని యధావిధిగా కొనసాగించారు.
=============================