BJP Dr. Kalyan Naik: బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ముందస్తు హౌస్ అరెస్ట్

సిరా న్యూస్, జైనూర్‌
బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ముందస్తు హౌస్ అరెస్ట్

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌ మండలంలోని గోండు మహిళపై ఒక ముస్లిం వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన ఇప్పటివరకు అతనిపై కఠిన చర్యలు తీసుకోకపోగా, అక్కడ ఉన్న గిరిజనులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్న దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో చలో జైనూరు కార్యక్రమం చేప‌ట్టింది. ఇందులో భాగంగానే శుక్ర‌వారం రాత్రి 1:00 గంటలకి డీడీ కాలనీ లోని నివాసంలో పోలీసులు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *