సిరాన్యూస్, ఉట్నూర్
కాంగ్రెస్ రాజ్యమా… ఖాకీల రాజ్యమా : భూక్యా జాన్సన్ నాయక్
రాజకీయంగా ఎదుర్కోలేక బిఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారు.కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉంటే నా మీద కేసులు పెట్టుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోనేది లేదని బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ విలేకరుల సమావేశంలో జాన్సన్ నాయక్ బుధవారం మాట్లాడారు. అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.పదవులు శాశ్వతం కాదు… ప్రజల గుర్తింపు శాశ్వతమని తెలిపారు. అక్రమ కేసులు పెట్టిస్తే భయపడేది లేదన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా. ఎమ్మెల్యేకు ఆర్థిక మంత్రి ఎవరో తెలుస్తలేదని ఆ విషయం అడిగితే అక్రమ కేసు నమోదు చేశారని. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు , అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.