సిరాన్యూస్, ఓదెల
వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు, లంబాడి తండా, నాంసానిపల్లి గ్రామాలలోని సొసైటీ, ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో తూకంలో ఎలాంటి తేడాలు రాకుండా, సజావుగా కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని అన్నారు. అలాగే కుల గణన సర్వేలో అధికారుల వద్ద రికార్డులను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుల గణన సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీ తిరుపతి, ఎమ్మార్వో బి యాకన్న, మండల వ్యవసాయ అధికారి బి భాస్కర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, ఏపీఎం లతా మంగేశ్వరి, ఏఈఓ సంధ్య, సీసీ రాజకుమారి, మారెళ్ళ శ్రీనివాస్ ఐకేపీ సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.