Dilawarpur: దిలావ‌ర్‌పూర్‌లో కాటమయ్య రక్ష కిట్‌పై అవ‌గాహ‌న

సిరా న్యూస్, ఖానాపూర్
దిలావ‌ర్‌పూర్‌లో కాటమయ్య రక్ష కిట్‌పై అవ‌గాహ‌న

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామ ఎల్లమ్మ గుడి దగ్గర సోమవారం ఖానాపూర్ నియోజకవర్గం లోని ఖానాపూర్, కడెం, దాస్తురాబాద్, పెంబి మండలం లోని వివిధ గ్రామలకు చెందిన 250 మంది గౌడ కులస్థులకు కాటమయ్య రక్ష కిట్ కి సంబందించిన శిక్షణ ప్రోగ్రాం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా నిర్మల్ ఎక్సైజ్ సిఐ ల‌క్ష్మ‌ణ్‌రావు మాట్లాడుతూ కళ్ళు గీత కార్మికుల తాటి చెట్లు ఎక్కడానికి రక్షణ కవచం ల పని చేస్తాయని, దాని ద్వారా చెట్ల పైన నుండి పడిపోకుండా నివారించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎక్సైజ్ సిఐ లక్సమనరావు , ఎస్సై, అభిషేకర్, సిబ్బంది వెంకటేష్, హరీష్, ఇర్ఫాన్, ముత్యం, నరేష్,భాస్కర్ కల్పనా, రవళి, దిలావర్పూర్ గ్రామ గౌడ కులస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *