Rape of a young woman in the old town : పాతబస్తిలో యువతిపై అత్యాచారం

సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తామని యువతి పై ఇద్దరు యువకుల అత్యాచారం జరిపారు. అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బండ్లగూడ పోలీసులు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యపేట కు చెందిన బాధితరు రాలు ఇంట్లో గొడవపడి రాత్రి బస్సు లో హైదరాబాద్ చేరుకుంది. రోడ్ పై నుండి వెళ్తుండగా ఇద్దరు యువకులు అపి వివరాలు అడగగా తనకి దెగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాలని కోరింది. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తామని చెప్పిబైక్ పై కూర్చోబెట్టుకొని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోడౌన్ కు తీసుకెళ్లి ఇద్దరు అత్యాచారం చేరని ఫిర్యాదులో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *