సిరా న్యూస్,అల్వాల్;
ఒక డ్రైవర్ అజాగ్రత్త ఒక బాలుడి ప్రాణాలను బలికొంది. అల్వాల్ లోని రిలయన్స్ ఫ్రెష్ కు సరుకుల తో వాహనానికి డరైవర్ హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు.దాంతో వాహానం రోడ్డుపైకి వెళ్ళి అటుగా తల్లితోపాటు వెళుతున్న ఓ బాలుని పైకి ఎక్కడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో మూడవ తరగతి చదువుతున్నాడు. ఘటనలో తల్లి క్షేమంగాబయటపడింది.