Bajirao: దహెగావ్ గ్రామంలో ఘనంగా ముగిసిన సప్తాహ

సిరాన్యూస్‌, బేల‌
దహెగావ్ గ్రామంలో ఘనంగా ముగిసిన సప్తాహ
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దహెగావ్ గ్రామంలో భవ్య జ్ఞ్యానేశ్వరి పారయణ్ సప్తహా వేడుకలు ఘనంగా ముగిశాయి.
శ్రీ బాజీరావ్ బాబా భవ్య జ్ఞ్యానేశ్వరి పారయణ్ సప్తాహా వేడుకలు గ్రామంలో ఏడు రోజుల వరకు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
చివరి రోజుగ్రామంలో ఉదయమే బాబా భక్తులు బాజీరావ్ బాబా పల్లకిని ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలు బజన కీర్తనలతో శోభయాత్ర చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా పాటిస్తూ చెడు వేసనాలకు దూరంగా ఉంటూ చిన్నపిల్లలు,మహిళలు,భక్తులు భారీగా తరలివచ్చారు.వివిధ గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన బాజీరావ్ బాబా భక్తులతో గ్రామం కిటకిటలాడింది.ఈ సందర్భంగా బాజీరావ్ బాబా భక్తులు మాట్లాడుతూ బాబా చూపిన మార్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సప్తహ కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరూ కలిసి కట్టుగా ఉత్సహంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.ఆధ్యాత్మిక మార్గంతోనే మనిషికి ప్రశాంతత లభిస్తుందని అన్నారు.చివరిగా దహి హాండి కాలతో ఈ కార్యక్రమాన్ని మండలంలోని వివిధ గ్రామాల బాజీరావ్ బాబా భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమంతో ఘనంగా ముగిసింది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ బాజీరావ్ బాబా శిష్యులు దౌలత్, బాపూరావ్ దొటే,బొక్రె శంకర్,మడావి చంద్రకాంత్,ప్రమోద్ బోయర్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *