Joint Collector Rahul Meena: కొట్టుకుపోయిన వంతెన ప్రదేశాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా

సిరా న్యూస్,సామర్లకోట
కొట్టుకుపోయిన వంతెన ప్రదేశాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా

కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఏలేరు వ‌ర‌ద ఉధృతికి పెద్దాపురం మండలం కాండ్రకోటలో దబ్బ కాలువపై ఉన్న‌ తాత్కాలిక వంతెన కొట్టుక‌పోయింది. కొట్టుకపోయిన వంతెన ప్రదేశాన్ని సోమ‌వారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. ఈసంద‌ర్బంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ వరద బారిన పడకుండా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. కాండ్రకోటలో ఏలేరు కాలువ సమీపంలో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామ‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎస్ఐ మౌనిక, రెవెన్యూ,పోలీసు అధికారులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *