సిరా న్యూస్;రంగారెడ్డి;
నార్సింగి పోలిస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్ లో విషాదం నెలకొంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడవ అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి మృతి చెందాడు. సమాచారం తెలియగానే నార్సింగీ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆంద్రప్రదేశ్ కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలి లోని ఓ కంపనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. కోకాపేట్ లో హాస్టల్ గదికి వచ్చి తనువు చాలించాడు