సిరా న్యూస్,అమరావతి;
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పలు విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపనలు చేపారు. రాజధాని గ్రామం తాళ్లాయపాలెం లో సబ్ స్టేషన్ ప్రారంభం,వర్చువల్ గా మిగిలిన ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేసారు. అయన వెంట పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తదితరులు వున్నారు. రాజధాని లో భవిష్యత్తులో నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా తాళ్లాయపాలెం లో రాష్ట్రంలోనే మొదటి జీఐఎస్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. రాజధానిలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారని మంత్రి నారాయణ ను అడిగి తెలుసుకున్నారు.