సిరా న్యూస్,హైదరాబాద్;
హైడ్రా కమిషనర్ రంగనాథ్ బృందం బెంగళూరుకు వెళుతున్నారు. బెంగుళూరు లో కర్ణాటక ప్రభుత్వం తో పాటు సీఎస్సార్ కింద కొన్ని కంపనీలు అభివృద్ధి చేసిన చెరువులను మూడు రోజుల పాటు స్టడీ చేయనున్నారు. తక్కువ ఖర్చు తో బెంగుళూరు లో 35 చెరువులను కర్నాటకా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు, తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రంగనాథ్ తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వెళుతున్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళన పై ఫోకస్ చేయనున్నారు. బాచుపల్లి ఎర్రగుంట చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, కూకట్ పల్లి నల్ల చెరువు, రాజేంద్రనగర్ అప్పా చెరువులకు పునరుజ్జివం తెనున్నారు.