సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దుద్యాల మండలంలో కలెక్టర్ పర్యటన ను అడ్డుకొని దాడి చేస్తున్న సమయంలో స్థానిక అధికారులు కానీ పోలీసులు గాని నిర్లక్ష్యం వహించారా అనే విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఒక జిల్లా కలెక్టర్ పై దాడి జరుగుతున్న సమయంలో అడ్డుకోవడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వినవస్తున్నాయి. ఏకంగా కలెక్టర్ పైనే ఇలా జరిగితే ఇతర అధికారుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గో బ్యాక్ అంటూ కలెక్టర్ ను అడ్డుకుంటున్న తరుణంలో పోలీసులు ఎవరు కలెక్టర్ పక్కన లేకపోవడం ప్రత్యక్షంగా కనిపిస్తోంది.