బారులు తీరిన ప్రకృతి ప్రేమికులు
సిరా న్యూస్,అల్లూరి;
అల్లూరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమై న వంజంగికి పర్యా టకుల తాకిడి ఎక్కువైంది. ఉదయ భానుడి లేలేత కిరణాల తాకిన వేళ.. వెండి మబ్బులు అందాలు చూపరు లను కట్టిపడేస్తున్నాయి. రాత్రివేళ లో చంద్రుని వెన్నెల కాంతి. తెల్లవారుజా మును.. సూ ర్యోదయాన్ని తిలకించేం దుకు ప్రకృతి ప్రేమికులు బారు లు తీరుతున్నారు.ఆంధ్ర ప్రదేశ్‌లోని పాడే రు గిరిజన ప్రాంతానికి సమీపంలో ఉన్న వంజంగి హిల్స్ ఇటీవలి కాలంలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌గా విశేష మైన గుర్తింపు సాధించింది. ముఖ్యం గా శీతాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలు ఎలాంటివారినైనా మంత్ర ముగ్ధులను చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సముద్ర మట్టానికి 3,400 అడుగుల ఎత్తులో ఉండే ఈ అందమైన హిల్‌స్టేషన్ ట్రెక్కింగ్ ప్రియులకు కూడా అద్భుతమైన గమ్యస్థానం. ఈ వంజంగి హిల్స్‌పై నుంచి సూర్యోదయం చూడటం నిజంగా నేత్రానందం గా భావిస్తుంటారు పర్యాటకులు. దింతో వంజంగి అందాలను ఆస్వాదించేందుకు క్యూ కడుతున్నారు.