సిరాన్యూస్,నాంపల్లి
సభ్యత్వ నమోదులో భాగస్వామ్యం కావాలి: బీజేపీ మండలం అధ్యక్షుడు దాచేపల్లి నరసింహ
బీజేపీ పార్టీ సభ్యత నమోదులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బీజేపీ మండలం అధ్యక్షుడు దాచేపల్లి నరసింహ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శ్రీకారం చుట్టారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బూతులో 200 మంది సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పార్టీ జెండా ఎగరవేయాలి అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.