సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
జమిలి ఎన్నికలు రాజకీయ కుట్ర : కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
జమిలి ఎన్నికలు రాజకీయ కుట్ర అని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ తన రాజకీయ మనుగడ కోసమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుందని ఆరోపించారు .నియోజకవర్గల పునర్వీభజన, బీసీ కుల గణన, జనాభా లెక్కలు అంశాలను పక్కనబెట్టి తమకు అవసరమైన జమిలి ఎన్నికలపైనే దృష్టి పెడుతుందని హేళన చేశారు. ఓకే దేశం ఒకే ఎన్నిక పేరుతో రాజకీయ పార్టీలను అణచివేయాలనే దాని పై సీరియస్ గా ఆలోచన చేస్తుందని విమర్శించారు .