సిరాన్యూస్, ఇచ్చోడ
నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీగా పట్ల గోవర్ధన్
నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అదిలాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కోకస్మన్నూర్ గ్రామానికి చెందిన పట్ల గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్ చేతులమీదుగా మండల కేంద్రంలో మంగళవారం పట్ల గోవర్ధన్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.