ఇతర ఆసుపత్రులకు రోగుల తరలింపు
సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్ లోని మోర్ సూపర్ మార్కెట్ పైన విజైబాబు ఆసుపత్రిలో బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని మాపక దళ సిబ్బంది, పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలోని రోగులను ఇతర ప్రయివేటు ఆసుపత్రులకు అంబులెన్సుల ద్వారా తరలించారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాలలోని డాక్టర్ విజైబాబును ఫోన్ లో పరమార్శించి రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.