సిరా న్యూస్ ఇంద్రవెల్లి:
ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కు వినతి పత్రం…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ కు మానవ హక్కుల వేదిక జిల్లా కమిటీ సభ్యులు వినతి పత్రం అందించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రం గుండా వెళ్లే రోడ్డు విస్తరణ పనుల గురించి ఎమ్మెల్యేకు విన్నవించారు. ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ కోసం నివేదికలు సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. వీలైనంత త్వరగా రోడ్డు విస్తరణకు సంబంధించి ప్రారంభం అయ్యేలా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పక రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందించిన వారిలో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు అతిష్ కాంబ్లే, నాయకులు ఎం డీ జహీర్, సూరజ్ సొన్ కాంబ్లే, మేస్రం భారత్, తదితరులు పాల్గొన్నారు.