సిరా న్యూస్,ఉట్నూర్ :
మాధవరావు దహన సంస్కారాలకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆర్థిక సహాయం
మండలంలోని దొంగచింత(భీంజీగూడా) గ్రామానికి చెందిన కుమ్ర మాధవరావు సోమవారం తెల్లవారుజామున హఠాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులకు వారి ఇంటికీ వెళ్లాలని సూచనలు చేశారు.ఈ సందర్బంగా మండల కమిటీ సభ్యులు మాధవరావు అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.