సిరా న్యూస్,బేల
సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలి : డీఎంహెచ్ఓ కృష్ణ
* ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేయరాదు
* బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కృష్ణ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిడీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు చేపడుతున్న చికిత్సల గురించి స్థానిక వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని వైద్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేల మండల కేంద్రంలో మరో రెండు నెలలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆర్.ఎం.పి వైద్యులు తమ స్థాయికి మించి వైద్యం చేయరాదని పేర్కొన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా మలేరియా వైద్యాధికారి శ్రీధర్, మండల ప్రాథమిక వైద్యాధికారి వంశీకృష్ణ ఉన్నారు.