సిరాన్యూస్, ఇల్లంతకుంట:
తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణ
* విద్యార్థి అక్షిత్ కుమార్‌కు బహుమతి అందజేత
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం జంగంరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అందించాలని కోరారు. అనంతరం 2024 మోడల్ స్కూల్ ఎగ్జామ్స్ లో మండల్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న విలాసాగరం అక్షిత్ కుమార్ కి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.