తెలంగాణ బజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు
సిరా న్యూస్,హైదరాబాద్;
అమ్మవారి నవరాత్రుల ఉత్సవాల్లో ఘనంగా నిర్వహించే దాండియాలో అన్యమతస్తులను బౌన్సర్లుగా, సిబ్బందిగా తీసుకోకూడవద్దని దాండియా నిర్వాహకులను తెలంగాణ బజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు హెచ్చరించారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో దాండియా కార్యక్రమానికి ప్రత్యేకత ఉందని, కానీ కొందరు అన్య మతస్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లవ్ జీహాదుకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాండియా నిర్వాహకులు కూడా అన్య మతస్తులను బౌన్సర్లుగా పెట్టుకోవడంతో లవ్ జీహాదుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, కావున అట్టి వారికి ప్రవేశం లేకుండా చూడాలన్నారు. లేకపోతే బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకొని తీరుతారని హెచ్చరించారు.