ఇంటింటికి అయోధ్య శ్రీరాముని అక్షింతలు..

సిరా న్యూస్,కౌతాళం;
మండల పరిధి గ్రామంలో ప్రతి ఇంటింటికి అయోధ్య శ్రీరాముని అక్షింతలు అందజేస్తామని ఆర్ఎస్ఎస్ సభ్యులు ఎస్. మల్లారెడ్డి, జీ. భీమేష్, ఎం. నాగేంద్ర, సి. పాలన్న, వి. నాగరాజు, వి. ఉసేని, వి. తిమ్మరాజు వి. కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అగసనూరు గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో అయోధ్య శ్రీ రామమందిరం అక్షింతలు భావ చిత్రం కరపత్రాలకు ఆలయ అర్భకులు చేత విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రలోని శ్రీరామ జన్నభూమి అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన శ్రీరామ భవ్య మందిర ప్రారంభోత్సవం ఈ నెల 22 వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో రామ మందిరం నుంచి ప్రతి అయోధ్య రామమందిర అక్షింతలను గ్రామ పెద్దలు, యువకులు గ్రామంలోని ప్రతి ఇంటికి శ్రీరాముని అక్షింతలు అందజేశారు. ప్రతిఒక్కరూ ఈ నెల 22 వ తేదీన దగ్గరలోని రామాలయంలో గానీ, ఇంట్లో గానీ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అయ్యోధ్య రాములు వారి అక్షింతలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, యువకులు సీతారాముల ఫోటోలకు పూజలు చేసి అక్షింతలు వేయాలని పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *