సిరా న్యూస్,నల్గోండ;
రోడ్డు పక్కన ఆగి వున్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఘటన చివ్వెంల మండలంలో గుంజలూరు శివారులో రోడ్డు ప్రమాదం గురువారం చోటుచేసుకుంది.. ఘటన లో పలువురు గాయాలపాలయ్యారు. ప్రమాద స్థలికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను పోలీసు సిబ్బంది వెలికి తీసారు. వారిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.