Adarsha Purushula Podupu Sangham: బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత…

సిరా న్యూస్, చిగురుమామిడి:

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత…

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మన్నపల్లి గ్రామానికి చెందిన ‘గ్రామ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం సభ్యుడైన పుట్టల సమ్మయ్య కుటుంబ సభ్యులకు ఆ సంఘం పాలక వర్గం సభ్యులు ఆర్థిక చేయుతను అందించారు. ఇటీవలే సమ్మయ్య మృతి చెందడంతో అభయనిధి విపత్‌ సహాయం, బీమా వన్, బీమా టూ, పొదుపులు, బోనస్‌ డబ్బులు కలిపి మొత్తం రూ. 78,923ల నగదును మృతుడి భార్య విజయకు అందించారు. ఈ సందర్భంగా సంఘం పాలక వర్గ సభ్యులు మాట్లాడుతూ.. మృతుడి కుటుంబ సభ్యులకు బాసటగా నిలిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *