Stop Personal Abuse: వ్యక్తిగత దూషణలు చేయడం అనైతికం…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

వ్యక్తిగత దూషణలు చేయడం అనైతికం…

మాజీ మంత్రి జోగు రామన్నపై, డీసీసీబీ చైర్మెన్‌ అడ్డి భోజారెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేయడం అనైతికమని బీఆర్‌ఎస్‌ పార్టి జైనథ్‌ మండల ప్రధాన కార్యదర్శి పులివేణి గణేష్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం ఈ మేరకు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30సంవత్సరాలు జోగు రామన్న వెంట ఉండి ఆయన బిక్షతో అనేక పదవులు పొందిన అడ్డి భోజారెడ్డి, పార్టీ మారిన తరువాత విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు. నాడు జోగు రామన్నతో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేసిన అడ్డి భోజారెడ్డి, పార్టీ మారిన తరువాత జోగు రామన్నపై ఆరోపణలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, జోగు రామన్నపై వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలని అయన హితువు పలికారు. ఈ సమావేశంలో జైనథ్‌ సర్పంచ్‌ దుమాల దేవన్న, నాయకులు చిన్న మల్లేష్, కోవ ప్రభాకర్, స్వామి, భూమన్న, చిన్నన్న, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *