సిరా న్యూస్, చిగురుమామిడి:
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో 1997-98 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం పూర్వ విద్యార్థులంతా తమ స్నేహితులను, గురువులను కలుసుకొని పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరినొకరు సంతోషంగా పలకరిస్తూ… బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పలువురు మాట్లాడుతూ… చాలా సంవత్సరాల తర్వాత ఒక్క చోటుకు చేరి సందడిగా, సంతోషంగా కబుర్లు చెప్పుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలు, పూలమాలతో సత్కరించారు.