బేల, సిరా న్యూస్
కొనసాగుతున్న నిరాహార దీక్ష
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు రద్దు కోసం తహసీల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న నిరాహార దీక్ష 7 వ రోజుకు చేరుకుంది. బైపాస్ రోడ్డు వద్దు పాత రోడ్డు ముద్దు అని అంటూ నినాదాలు చేస్తున్నారు. ధోప్తాల, శంషాబాద్, బేల, మొహబ్బత్ పూర్, బురాన్ పూర్, రెవెన్యూ గ్రామాల శివారు రైతులు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు బుధవారం ఏడో రోజుకు చేరుకుంది. దీనిపై కొందరు రైతులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. బైపాస్ రోడ్డు తమ పొలాల్లో వద్దు అని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు మిర్జాపూర్ సర్పంచ్ విపిన్ ఖోడే, గణేష్, ఉత్తమ్ డేష్ముఖ్త రైతులు ఉన్నారు.