హైదరాబాద్ ,(సిరా న్యూస్);
;స్వామి అయ్యప్ప ఆశీస్సులతో కాలేరు వెంకటేష్ గురు స్వామి అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని అంబర్పేట అయ్యప్ప భక్త సమాజం ఆశీర్వాదం అందజేసింది బుదవారం బీఆర్ఎస్ అభ్యర్థికాలేరు వెంకటేష్ అంబర్ పేట స్వామి అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికి ఆయురారోగ్యాలతో ప్రసాదించమని కోరుకున్నారు. అనంతరం అక్కడి గురుస్వాములు కాలేరు వెంకటేష్ కు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా విజయ కుమార్ స్వామి రచించి, గానం చేసిన శ్రీ అయ్యప్ప భక్తి గీతాల సీడీ “ ఎవరికైన దవురుకునా ఈ భాగ్యము” ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వాములు పాల్గొన్నారు.