కొలిమిగుండ్ల సీఐగా బాధ్యతలు చేపట్టిన గోపీనాథ్ రెడ్డి,

నూతన సిఐ కి స్వాగతం పలుకుతున్న పలు సమస్యలు…

సిరా న్యూస్,కొలిమిగుండ్ల,

కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో నూతన సిఐగా గోపీనాథ్ రెడ్డి సోమవారం నాడు బాధ్యతలు చేపట్టారు. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ రమేష్ రెడ్డి ఎలక్షన్ సందర్భంగా ఆయనను సంజామల పోలీస్ స్టేషన్ కు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ పోలీస్ స్టేషన్గా అప్గ్రేడ్ కావడంతో కడప జిల్లా తలమంచి పట్టణం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న గోపీనాథ్ రెడ్డి బదిలీల్లో భాగంగా కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ కు సర్కిల్ ఇన్స్పెక్టర్గా గోపీనాథ్ రెడ్డి బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. నూతన సీఐ గోపీనాథ్ రెడ్డికి కొలిమిగుండ్ల మండలంలో అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా కొలిమిగుండ్ల మండలంలోని గ్రామాలలో పేకాట, నాటు సారా, మట్కా, ఇంకా తదితర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. కొలిమిగుండ్ల సిఐగా బాధ్యతలు చేపట్టిన గోపీనాథ్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలైన వాటిపై దృష్టి పెట్టి, ముఖ్యంగా మట్కా, పేకాట, నాటు సారా, వంటి వాటిని అరికట్టాలని మండల ప్రజలు పోలీసులను కోరుతున్నారు. కొలిమిగుండ్ల మండలంలోని ప్రధాన రహదారుల పక్కన రోడ్డు కిరువైపులా మైనింగ్ వేస్టేజ్ రాయిని ఫ్యాక్టరీల యాజమాన్యం వారు ఎక్కడపడితే అక్కడ వదలడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గత మూడు రోజుల కిందటే ఇటిక్యాల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. బాధ్యతలు చేపట్టిన నూతన సీఐ గోపీనాథ్ రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ఆయనను కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *