Basara Vasatha Panchami: బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు…

సిరా న్యూస్, నిర్మల్:

బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు…

+ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రామారావు పటేల్

+ పోటెత్తిన భక్తులు

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అభిషేక, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఈ మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి వసంత పంచమి మహోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున ఎమ్మేల్యే పట్టు వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ దండే విట్టల్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, స్థానిక నాయకులు, భక్తులు ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు, అభిషేకాలు గావించి మొక్కుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *