సిరా న్యూస్,పెంబి
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
* ఆస్పత్రిలో పండ్లు పంపిణీ
నిర్మల్ జిల్లాలోని పెంబి మండల కేంద్రం లోని శనివారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను బీఆర్ ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరోగులకు పండ్లు, ఫలహారాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్ గౌడ్, మహేందర్, కౌట నరేందర్, సరోజు, గండ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.