చంద్రబాబు మగాడైతే….బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలి

సిరా న్యూస్,గుడివాడ;
గుడివాడలో తనకు సిటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు…. రామోజీ ,రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, పౌడర్ డబ్బా గాళ్ళు కాదు. సీఎం జగన్ మార్చే అభ్యర్థులు, తీసేసే వారి పేర్లనే గత ఏడు లిస్టుల్లో ప్రకటించారు….రాష్ట్రంలో ఇంకా సీట్లు ప్రకటించని 105 సీట్లు ఉన్నాయి. వినేవాడు తెలుగు తమ్ములైతే… చెప్పేవాడు చంద్రబాబులా ఎల్లో మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. సీటు ఎవరికో అధిష్టానమో, మా పార్టీ నాయకులు చెబుతారు….. మధ్యలో ఉన్న పకోడీ గాళ్ళకేం సంబంధం. తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు సీఎం జగన్ సీట్లు ఇచ్చాడు. బ్రోకర్ పనులు, పైరవీలు చేస్తానో, డబ్బుందనో, ఎవరో చెప్పారని వైసీపీలో సీట్లివ్వరు.
సీఎం జగన్ లా చంద్రబాబు మగాడైతే….బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలి. గన్నవరం నుండి వల్లభనేని వంశీనే పోటీ చేస్తాడు. కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే నాకు,వంశీకు సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. టిడిపిలో అయితే వారి మీడియా ఛానల్సే అభ్యర్థుల లిస్టులు ప్రకటిస్తాయి. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు….. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు…. అవి అర్థవంతంగా ఉండాలిగా. దమ్ముంటే నన్ను ఓడించడానికి చంద్రబాబును గుడివాడ అభ్యర్థిగా పెట్టాలి…. అదెలాగో చేతకాదు… ఎల్లో మీడియా అధినేతలందరూ అనుకుంటే నా సీటు పోతుందా. జీవితాంతం మాజీగా ఉండే చంద్రబాబు X నుండి ఛాలెంజ్ లు చేస్తున్నాడు. సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటాడని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *