సిరా న్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ రాజ్ సెక్రెటరీ అధ్యక్షునిగా అరుణ్ రెడ్డి
ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ భవన్ లో గురువారం జిల్లా జూనియర్ పంచాయతీ రాజ్ సెక్రెటరీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా అరుణ్ రెడ్డి, జనరల్ సెక్రెటరీగా ప్రశాంత్, కోశాధికారిగా కపిశ్వర్ చౌహాన్, వైస్ ప్రెసిడెంట్ గా ఎస్. రాజేష్ ,
మహిళ వైస్ ప్రెసిడెంట్ గా పూజ, జాయింట్ సెక్రెటరీగా కుమ్ర మోతిరాం, రాజేందర్, మహిళా జాయింట్ సెక్రటరీగా బి. నేహ సలహా , కార్యనిర్వాహక కార్యదర్శలుగా అనిల్ రెడ్డి, రాదేషం, ఎ. అవినాష్, చక్రవర్తిలు ఎన్నికయ్యారు. వీరిని పలువురు అభినందించారు.