Sampath Nandi: థ్రిల్లర్ మూవీలో తమన్నా

సిరా న్యూస్, హైద‌రాబాద్‌
థ్రిల్లర్ మూవీలో తమన్నా
* సంపత్ నంది డైర‌క్ష‌న్‌లో కాశీలో షూటింగ్‌
సంపత్ నంది డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న థ్రిల్లర్ మూవీలో తమన్నా న‌టిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన సంపత్ నంది ఆయుధం సినిమాతో వెండితెరకు పరిచయ‌మ‌య్యారు. రచ్చ, బెంగాల్ టైగర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో యంగ్ డైనమిక్ డైరెక్టర్ సంపదనంది ముందుకు దూసుకుపోతున్నారు.ఓదెల టు సినిమాను శుక్ర‌వారం కాశీలో షూటింగ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్ నటిస్తున్నారు. థ్రిల్లర్ మూవీగా తీ స్తున్న సంపద నంది ఈ సినిమా నిర్మిస్తున్న బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆయన అన్నారు. సినిమాకి డైరెక్టర్ గా అశోక్ తేజ .నిర్మాతగా సంపధ్ నంది వ్యవహరిస్తున్నారు. సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *