Surendra Babu:ర‌హ‌దారుల‌కు మ‌ర‌మ్మ‌తులు

సిరా న్యూస్, కుందుర్పి
ర‌హ‌దారుల‌కు మ‌ర‌మ్మ‌తులు
* సురేంద్ర బాబును అభినందిస్తున్న గ్రామ‌స్తులు
కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం, నూతిమడుగు గ్రామాలలో అధ్వాన్నంగా ఉన్న ర‌హ‌దారుల‌కు కళ్యాణదుర్గం అసెంబ్లీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో జెసిబి సాయం తోగురువారం మ‌ర‌మ్మ‌తులు చేయించారు.రోడ్లపై ప్రయాణించడానికి నరకయాతన పడుతున్న ప్రయాణికులకు చదును చేయడంతో ప్రయాణానికి సుగమం అయింది. ఈ సందర్భంగా అమిలినేని సురేంద్ర బాబు ఆయా గ్రామాల ప్రజలు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అలాగే తిమ్మాపురం నుండి ఓబగానపల్లి గ్రామానికి,ఓబగానపల్లి గ్రామం నుండి కంబదూరు మండల కేంద్రానికి వెళ్లే రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి . ఆ గ్రామాలలో కూడా మట్టి వేయించి గుంతలు లేకుండా చూడాలని ఆ గ్రామ ప్రజలు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *