Indian Red Cross:ఉచిత మెగా వైద్య శిబిరం

సిరా న్యూస్, భీమదేవరపల్లి
ఉచిత మెగా వైద్య శిబిరం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 50 సంవత్సరాల పైబడిన వారికి ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు, ఇతర పరీక్షలను నిర్వహించారు. అనంతరం వ్యాధులకు సంబంధించి మందుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోచంపల్లి రాజిరెడ్డి, నారగోని నరేందర్ గౌడ్, పాత పెళ్లి సంపత్, గూడెల్లి రవీందర్ రెడ్డి, రెడ్ కార్డ్స్ సొసైటీ డాక్టర్లు, గ్రామస్తులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *