Kadarapu Praveen: జిల్లా సదస్సును జయప్రదం చేయండి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
జిల్లా సదస్సును జయప్రదం చేయండి
* ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదరపు ప్రవీణ్ మాదిగ
* జిల్లా సదస్సు పోస్ట‌ర్ విడుద‌ల‌
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్క‌ర్ భ‌వ‌నంలో ఈనెల 21న నిర్వ‌హించే మాదిగ, మాదిగ ఉపకులాల జిల్లా సదస్సును జయప్రదం చేయాల‌ని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదరపు ప్రవీణ్ మాదిగ అన్నారు. గురువార జిల్లా కేంద్రంలో స‌ద‌స్సుకు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఏ బి సి డి వర్గీకరణ , మాదిగ డప్పు కళాకారులకు నెలకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ హాజరవుతున్నారని తెలిపారు.మాదిగ మాది ఉపకులాల సోదరులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుంకే రమేష్ మాదిగ పట్టణ అధ్యక్షులు దర్శనాల గంగన్న మాదిగ, ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలు నారపాక పరిమళ మాదిగ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ నడికుంటి పెంటన్న మాదిగ, గుడి మండల అధ్యక్షులు సుద్దాల రాజు మాదిగ ,తాంసి మండల అధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *