Sitakka:గిరిజన క్యాంటీన్ తో గిరిజనులకు ఉపాధి

సిరా న్యూస్,ఉట్నూర్
గిరిజన క్యాంటీన్ తో గిరిజనులకు ఉపాధి
* మంత్రి సీతక్క
* గిరిజన క్యాంటీన్ ప్రారంభం
క్యాంటీన్ ఏర్పాటు చేయడం వలన నలుగురు కొలాం గిరిజనులకు ఉపాధి లభించిందని రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ , ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క అన్నారు. శుక్ర‌వారం సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఉట్నూర్ ఆద్వర్యం లో గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన గిరిజన క్యాంటీన్ ను శుక్రవారం రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ , ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ స్థానిక గిరిజన భవన్ లో గిరిజన క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్లేట్ మీల్స్ 5రూపాయలు, మధ్యాహ్నం 12.00 గంటల నుండి 2.00 గంటల వరకు ఉంటుందని అన్నారు. ఆన్నారు.శాశ్వత షెడ్డు కొరకు టెండర్ ఖరారు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే వేడ్ బోజ్జూ, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *