Kottūru sandhya:బెల్ట్ షాపులతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం

సిరా న్యూస్, చిగురుమామిడి
* బెల్ట్ షాపులతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం
* ఎక్సైజ్ శాఖ నిర్లక్ష వైఖరి పట్ల ఎంపీటీసీ నిర‌స‌న
* వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం
బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతూ వాటి వల్ల ప్రజల జీవితాలను చిన్నాభిన్నంమవుత్ళున్నాయని వాటిని వెంటనే నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జరిగిన చిగురుమామిడి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపిటిసిలు నిరసన వ్యక్తం చేశారు.ఎంపిపి కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు కొత్తూరు సంధ్య, పెసరి జేమున, అందే స్వప్న, మంకు స్వప్న, మిట్టపల్లి మల్లేశం, మెడబోయిన తిరుపతి సమావేశం మధ్యలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించడంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలమైందని దానికి నిరసనగా నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. చిన్న ముల్కనూర్ లో మోడల్ స్కూల్కు అతి సమీపంలో ఉన్న వైన్స్ ద్వారా విద్యార్థులు మత్తు పానీయాలకు అలవాటు ప్రమాదం ఉందని ఆ వైన్స్ పర్మిషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ వారు స్పందిస్తూ ముల్కనూర్ లో ఉన్న వైన్స్ చట్ట ప్రకారమే ఏర్పాటు చేయడం జరిగిందని వివరణ ఇచ్చారు.గ్రామాల్లో చట్ట విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ఎంపిటిసి మిట్టపల్లి మల్లేశం మాట్లాడుతూ బొమ్మనపల్లి కార్యదర్శి రమణారెడ్డి విధులను సరిగా నిర్వర్తించడం లేదని అతను తమ గ్రామానికి కార్యదర్శిగా వద్దని.. అతని బదిలీ చేసి వేరే కార్యదర్శిని గ్రామానికి నియమించాలని డిమాండ్ చేశారు.ఎంపీపీ స్పందిస్తూ జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్ తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు.వివిధ శాఖల పని తీరుపై చర్చించారు.ప్రధానంగా త్రాగునీటి సమస్య పై చర్చించారు.ఎంపీటీసీ ల నిరసన పట్ల కాంగ్రెస్స్ నాయకులు స్పందిస్తూ..బిఅర్ఎస్ ఎంపీటీసీ లు బెల్ట్ షాపులను మోసెయ్యలని నిరసన తెలుపడంలో రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనబడుతుందని అన్నారు.బిఅర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదాని ప్రశ్నించారు. కాంగ్రెస్స్ మ్యానిఫెస్టోలో చెప్పినట్లు బిల్ట్ షాపుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంపీడీవో మధుసూదన్,ఖజామైనొద్దిన్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు,సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *