చర్లపల్లిలో ప్రస్తుతం మనుగడ లోనున్న లైన్లలోనే రైళ్లరాకపోకల నిర్వహణ
సిరా న్యూస్,చర్లపల్లి;
చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరికొన్ని వారాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగర ప్రాంతంలో రైళ్లు ప్రధానంగా మూడు ప్రధాన టెర్మినల్స్ అయిన సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు కాచిగూడ ద్వారా సేవలు అందిస్తున్నాయి. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్నరద్దీ అవసరాలను తీర్చడానికి, జంట నగరానికి పశ్చిమ భాగంలోని లింగంపల్లిని మరొక టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధిచేయబడింది. ఇదే వరవడిని ముందుకు తీసుకెళ్ళే దిశలోభాగంగా చెర్లపల్లి రైల్వేస్టేషన్‌ను మరో టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయబడుతుంది.
చర్లపల్లి హైదరాబాద్ కు తూర్పు వైపున ఉంది. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది మరియు ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానానికి సమీపంలో సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా జంట నగర ప్రాంతంలో ఉన్న ఇతర రైలు టెర్మినల్స్‌లో రద్దీని తగ్గించడo మరియు ముఖ్యంగా నగరం తూర్పు భాగంలోని ప్రయాణీకులకు సేవలను అందించడానికి కూడా ఈ స్టేషన్‌ను టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తన్నారు.
స్టేషన్లో వచ్చే ఇతర ప్రధాన సౌకర్యాలు: బస్ బే, కోచ్ ఇండికేషన్ బోర్డులు మరియు రైలు సూచన బోర్డులతో పాటు 4-వీలర్, 3-వీలర్ మరియు టూ-వీలర్ వాహనాలకు తగిన స్థలం, అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, యట్ ఏ గ్లాన్స్ బోర్డులు, 24 గంటలు సి. సి. టి. వి నిఘా వ్యవస్థ మొదలైనవి.