సిరా న్యూస్, జైనథ్
ఘనంగా బాజీరావ్ బాబా సప్తహా
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మెడిగూడ (ఆర్) లో ఘనంగా బాజీరావ్ బాబా సప్తహా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గత వారం రోజుల నుండి గ్రామంలో బాజీరావు బాబా పారాయణ సప్తహా కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు అయిన శనివారం చిన్నపిల్లల తో దేవుళ్ళ వేషధారణతో ఎడ్ల బండి పై కూర్చోబెట్టుకొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర చేపట్టారు. యశోద యాత్రలో భక్తులుభజన సంకీర్తనలతో పాటు డీజే చెప్పులతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామం మొత్తం పండగ వాతావరణం సంతరించుకుంది. మహా అన్నదాన కార్యక్రమం సైతం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్, నాయకులు కట్కం రాందాస్ బింగి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.