సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో అక్రమంగా ఓ ఇంట్లో నిలువ ఉంచిన మద్యాన్ని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసిన ఓ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు పాపుకొల్లు గ్రామంలోని గుమ్మడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో అక్రమ మద్యం నిల్వ ఉన్నట్లు సమాచారం తెలియడంతో దాడులు నిర్వహించడం జరిగిందని, ఈ దాడుల్లో ఒక లక్ష 20 వేలు రూపాయలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.ఎన్నికల నిబంధనలు అమలులోఉన్నందున ఎవరైనా నిబంధనలను అతిక్రమించి మద్యం నిలువ చేయడం కానీ తరలించడం కానీ చేస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు