ప్రచారంలో దూసుకెళ్తున్న విజయసాయి రెడ్డి

సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నెల్లూరు నగర శాసనసభ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఖలీల్ అహ్మద్ తో కలిసి నేడు వార్డుల్లో పర్యటించారు. ఎంపీఅభ్యర్థిగా తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ కు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. స్థానిక పరిస్థితులు దృష్ట్యా రెండు రోజులు ఈ ప్రాంతంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానంటూ స్థానికులకు హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *