సిరాన్యూస్, బేల
ఫంక్షన్ హల్ ప్రారంభం
గ్రామస్తుల మహాన్నదానం
ఆదిలాబాద్ బేల మండలంలోని సాంగిడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హల్ ను శుక్రవారం వేదపండితుల నడుమ ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులందరు ఉదయమే వేద పండితుల చేతులమీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం మహాన్నదానం చేపట్టారు.ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లో భాగంగా ఈ రోజు అందరి సహాయ సహకారం తో నూతన ఫంక్షన్ హల్ నిర్మించుకోవడం జరిగింది అని పేర్కొన్నారు.చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు శుభాకార్యాల కోసం వినియోగించు కోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సాంగిడి గ్రామస్థుల తో పాటు చుట్టూ పక్కల గ్రామాలు హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పెంటన్న సర్, మంచాల భూపతిరెడ్డి, డాక్టర్ అమృత్ రెడ్డి ,కన్నల గంగన్న, పరాటకార్ భాల్చందర్ మాజీ సర్పంచ్ నల్ల దయాకర్ రెడ్డి, ఉద్యోగ సంఘాలు సాంఘిక గ్రామంలోని ఇతరులు తదితరులు పాల్గొన్నారు.