సిరా న్యూస్,అనకాపల్లి;
ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ నిబం ధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపుతున్నా ఆంధ్రప్రదేశ్ లో అధికా ర పార్టీ మాత్రం ఎన్నికల కోడ్ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది. తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరంలో ఓటర్లకు చీరలు పంచుతూ ఫ్లైయింగ్ స్క్వా డ్ కు వైసీపీ నాయకులు అడ్డంగా దొరికారు. వైసీపీ జడ్పీటీసీ భర్త శ్రీకాంత్ తన అర్ధాంగి అభివృద్ధి కోసం అధిష్టా నం మాటలనుతూచాతప్పకుండా పాటిస్తున్నారు అనడా నికి చోడవరంలో ఓటర్లకు చీరలు పంచుతూ పట్టుబడ మే నిదర్శనం అంటున్నారు స్థానికులు. ఇక శ్రీకాంత్ చీరలు పంచుతుం డగా ఫ్లైయింగ్ స్క్వాడ్ కు చిక్కారు. అనంత రంశ్రీకాంత్ కార్ లో ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు చెయ్యగా చీరలు లభ్యమ య్యాయి.స్వయాన చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ భార్య తోపాటు పలువురు వైసీపీ ఎంపీటీసీలు,వార్డ్ మెంబర్లతో పంపిణీ కార్యక్రమం చేపట్టగాఅధికారుల బ్రేకులు వేశారు. స్వయాన ఎమ్మెల్యే ధర్మ శ్రీ భార్య కూడా ఘటనా స్థలంలో ఉండటంతో అధికారులు ఆవిడ పేరును తప్పించడానికి ప్రయత్ని స్తున్నా రంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.