ఎమోషనల్ జర్నీగా రూపొందిన ‘డంకీ’ చిత్రం నుంచి ‘డంకీ డ్రాప్ 3’గా ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ అనే మెలోడి సాంగ్ విడుదల  

సిరా న్యూస్,;
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘డంకీ’. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రతి రోజు ఈ మూవీ నుంచి రిలీజ్ అవుతున్న మూవీ కంటెంట్ అంచనాలను పెంచుతూ వస్తోంది. ఇప్పటికే ‘డంకీ డ్రాప్ 2’ అంటూ ‘లుట్ పుట్ గయా..’ సాంగ్‌ను మేకర్స్ విడుల చేసిన సంగతి తెలిసిందే. ప్రీతమ్ సంగీత సారథ్యంలో ఈ సాంగ్‌ను సోనూ నిగమ్ అద్భుతంగా పాడారు. దీంతో పాటు డంకీ డ్రాప్ 1 అంటూ ఓ వీడియోను కూడా అంత కంటే ముందుగానే మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీటిని ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించారు. షారూక్, సోనూ నిగమ్ కాంబినేషన్ లో వచ్చిన పాటలన్నీ పెద్ద హిట్ సాంగ్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డంకీ కోసం వీరిద్దరూ మరోసారి ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ సాంగ్‌తో మ్యాజిక్‌ను క్రియేట్ చేశారు.
ఈరోజు విడుదల చేసిన డంకీ డ్రాప్ 3లోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ సాంగ్ సినిమాలో ఎమోషనల్ పార్ట్ లో మరో హృద్యమైన పొరను అదనంగా జోడించింది. నలుగురు స్నేహితులు విదేశాలకు వెళ్లాలని తాపత్రయ పడతారు. వారి భావోద్వేగ ప్రయాణంలో ఉండే ఆరాటాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పాటలో భవిష్యత్తులో బావుండాలనే ఉద్దేశంతో  విదేశాల్లో ఉంటుంటారు. అలాంటి వారు తమ మాతృదేశానికి దూరమై దానిపై చూపించే ప్రేమను ఈ పాట వెల్లడి చేస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *