సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలి
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ అన్నారు. ఆదివారం జైనథ్ మండలంలోని కోర్ట గ్రామ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్, బీజేపీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామిని కూడ కాంగ్రెస్ పార్టి నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, మహిళలకు నెలకు రూ. 2500ల నగదు, రూ. 500లకే గ్యాస్ సిలీండర్ ఇలా ఏ ఒక్క హామీని కూడ అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్ననారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనతరం గిమ్మ గ్రామంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సావాపూరే విజయ్ కుమార్, నాయకులు సర్సన్ లింగారెడ్డి, కోల భోజన్న, గోస్కుల మహేష్, మద్దుల ఊశన్న, తదితరులు పాల్గొన్నారు.